Tuesday, March 2, 2010

కొన్ని వాస్తవాలు


భౌగోళిక విస్తీర్ణంలో దేశంలో నాలుగో పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జనాభా పరంగా చూస్తే ఐదో అతిపెద్ద రాష్ట్రం
ఎంపీల లెక్కల్లో చూస్తే.. మనది నాలుగోస్థానం. (లోక్‌సభకు 42 , రాజ్యసభకు 18 )
42 ఎంపీల్లో 33 మంది అధికార కాంగ్రెస్ పార్టీ వారే.
రాష్ట్రం విడిపోతే...(42)
ఆంధ్రాకు 25
తెలంగాణకు 17
ఆంధ్రా ప్రాంతానికి ఉపయోగపడే సముద్రతీరం 972 కి.మీ.. (దేశంలోనే తొలిస్థానం)
కేజీ బేసిన్‌లో విస్తారమైన సహజవాయు నిక్షేపాలు
మొదటి ఎస్సార్సీ
భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం డిసెంబర్, 1953 లో ఫజల్ అలీ ఛైర్మన్‌గా రాష్ట్రాల పునర్విభజన కమిషన్‌ ఏర్పాటు
సెప్టెంబర్ 30, 1955న ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఫజల్ అలీ
- ఒకవేళ రెండు రాష్ట్రాలను విలీనం చేయాలని భావిస్తే మాత్రం.. ఇప్పటికిప్పుడే ఆ ప్రయత్నం చేయకూడదని రిపోర్ట్‌లో పేర్కొంది. ఆంధ్రా ప్రజల్లో విశాలాంధ్రకు సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం.. ఈ విషయంలో అనిశ్చితి నెలకొందని ఫజల్ అలీ గుర్తించారు. అందుకే.. 1961లో జరిగే ఎన్నికల తర్వాత.. హైదరాబాద్ అసెంబ్లీలో విశాలాంధ్రకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టాలని... మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధిస్తేనే.. రాష్ట్రాల విలీనానికి అంగీకరించాలని స్పష్టంగా చెప్పారు.

మార్చి 6, 1956

ఓ అమాయకురాలైన తెలంగాణకు.. తుంటరి అబ్బాయి లాంటి ఆంధ్రాకు ముడిపెడుతున్నామన్న నెహ్రూ

తెరపైకి పెద్దమనుషుల ఒప్పందం

ఆంధ్రా,తెలంగాణ బడ్జెట్‌లను ప్రత్యేకంగా నిర్వహించాలి
తెలంగాణ ప్రాంతంలో విద్యవైద్య సౌకర్యాలను పెంచాలి.
ఉద్యోగాల విషయంలోనూ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి.
తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలను అమలు చేయాలి. ఆంధ్రా ప్రాంతం వారు.. తెలంగాణకు వచ్చి 12 ఏళ్లు ఉంటే గానీ, స్థానికులుగా గుర్తించకూడదు.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులను చెరో ప్రాంతం తీసుకోవాలి.
ఇక తెలంగాణ అభివృద్ధి విషయంలో నిర్ణయాధికారాలు తీసుకొని.. ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి రీజనల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి.
హామీలను ఆంధ్రా శాసనసభలో స్వయంగా ప్రకటించిన నీలం సంజీవరెడ్డి

నెరవేరని హామీలు


53 సంవత్సరాల కాలంలో.. 15 మంది రాష్ట్రానికి ముఖ్యమంత్రులైతే.. ఇందులో ముగ్గురు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. ఈ ముగ్గురూ కలిసి సరిగ్గా ఏడేళ్లపాటూ పాలించింది లేదు. (పి.వి.నర్సింహారావు, అంజయ్య, మర్రి చెన్నారెడ్డి) (జలగం వెంగళరావు కాకుండా)

ఏడాదికే కనుమరుగైన ప్రత్యేక బడ్డెట్
రాష్ట్రానికి అయ్యే వ్యయాన్నిఆంధ్రా,తెలంగాణ ప్రాంతాల మధ్య వేరువేరుగానే పంచాలి
ఏర్పాటు కాని రీజనల్ కమిటీ
1969లో వచ్చిన ఆరు సూత్రాల పథకం కూడా తెలంగాణలో మార్పులను తీసుకురాలేదు
ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఏర్పడినా దీనివల్ల.. ఇక్కడి ప్రాంతానికి జరిగిన మేలేమీ లేదు

నిజాం హయాంలో తెలంగాణలో ఏర్పాటైన కంపెనీలు
1921 లో సింగరేణి
1937లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1942లో ఆల్విన్ మెటల్ వర్క్క్
1943లో ప్రాగా టూల్స్
1946లో సిర్ఫూర్ పేపర్ మిల్స్
1947లో హైదరాబాద్ ఆస్‌బెస్టాస్

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కంపెనీలన్నీ మూతబడ్డాయి


2:1 నిష్పత్తిలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య ఉద్యోగాల పంపకం జరగాలి.
రాష్ట్రంలో మొత్తం 14 లక్షల మంది ప్రభుత్వోద్యోగులుంటే.. అందులో తెలంగాణ వారి వాటా కేవలం 2.5 లక్షలు
తెలంగాణకు ఇప్పటివరకూ దక్కని అడ్వకేట్ జనరల్ పదవి
రాష్ట్ర ఆదాయంలో దాదాపు 45 శాతం తెలంగాణ ప్రాంతం నుంచే
ఇక్కడ ఖర్చు పెడుతున్న మొత్తం కేవలం 28 శాతం మాత్రమే


నీటి పారుదల... వ్యవసాయం

సాగుకు అనువైన భూమి తెలంగాణలో 64 లక్షల హెక్టార్లు
కోస్తాంధ్రలో 46 లక్షల హెక్టార్లు
నిజామాబాద్ జిల్లాలో శ్రీరాం సాగర్ కట్టడం మొదలుపెట్టి 46 సంవత్సరాలు
1956-2002 మధ్య సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు రూ.12,104 కోట్లు
1955-56 నుంచి 2001-02 మధ్య 27.47 లక్షల హెక్టార్ల నుంచి 55 లక్షల హెక్టార్లకు పెరిగిన సాగువిస్తీర్ణం
90 శాతం నిధులు మేజర్, మీడియం ఇరిగేషన్‌కే కేటాయింపు
మైనర్ ఇరిగేషన్‌కు కేవలం 10 శాతం నిధులే కేటాయింపు
1955-56లో చెరువులు, కుంటల కింద 10.68 లక్షల హెక్టార్ల సాగు.. 2001-02 నాటికి 5.67 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. దీనివల్లే తెలంగాణలో సాగు పడిపోయింది.
2003- 04 నాటికి ఉభయ గోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాల్లోనే కాలువల కింద 6.93 లక్షల హెక్టార్ల సాగు
2004-05 నాటికి ఇది 8.34 లక్షల హెక్టార్లకు పెరిగిన సాగు (రాష్ట్రంలో సాగవుతున్న భూమిలో ఇది 60 శాతం)

జలయజ్ఞం కింద


26 ప్రాజెక్టులు పూర్తి
సాగులోకి 59 లక్షల హెక్టార్లు
ఆంధ్ర ప్రాంతంలో 43 లక్షల హెక్టార్లు
తెలంగాణలో 16 లక్షల హెక్టార్లు
తెలంగాణలో చేపట్టినవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలే

No comments:

Post a Comment